కేంద్ర ప్రభుత్వ గెజిట్ జల హక్కుల ఆక్రమణ!
కేంద్ర ప్రభుత్వం జూలై 15, 2021న కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల పరిధి నిర్ణయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కృష్ణా, గోదావరి నదులపై, వీటి ఉపనదులపై నిర్మాణమవుతున్న, ఇప్పటికే నిర్మించిన అన్ని మధ్యతరహా, భారీ ప్రాజెక్టులను బోర్డుల