Chain of Lakes System in Telangana

మిషన్‌ కాకతీయ

మిషన్‌ కాకతీయ

తెలంగాణ గ్రామీణ వ్యవస్థకు చెరువే ఆదరువు. కాకతీయ కాలం నుంచి తెలంగాణ ప్రాంతంలో గొలుసుకట్టు చెరువుల నిర్మాణం పెద్ద సంఖ్యలో జరిగింది. ఆ తరువాత ఆధికారంలోకి వచ్చిన అసఫ్‌జాహీ, కుతుబ్‌షాహీల పాలనా కాలంలో కూడా పాత చెరువులను పరిరక్షిస్తూ మరెన్నో కొత్త చెరువులు కూడా నిర్మించారు.