అన్ని వర్గాలపై వరాల జల్లు
బంగారు తెలంగాణ నిర్మాణాన్ని సాకారం చేసుకొనే దిశగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఫిబ్రవరి 22న శాసన సభలో సమర్పించారు. ఆర్థిక శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి మొత్తం 1,82,017 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టారు.