తెలంగాణ దళిత బంధు
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి ‘తెలంగాణ దళిత బంధు’ అనే పేరును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఖరారు చేశారు. మొదటగా, పైలట్ ప్రాజెక్టు కింద ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి, ‘తెలంగాణ దళిత బంధు’ పథకం అమలును ప్రారంభించాలని, అందులో భాగంగా పైలట్ నియోజకవర్గంగా కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు.