గంజాయి సాగు, వినియోగంపై ఉక్కుపాదం
రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంతి కె. చంద్రశేఖరరావు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ రెండు శాఖల ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులనుద్దేశించి మాట్లాడారు.