పేదల ఆత్మగౌరవ సౌధాలు
రెండు పడక గదుల గృహాలు పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఓల్డ్ మారెడ్ పల్లిలో 5.18 ఎకరాలలో ఒక్కొక్కటి 560 స్క్వేర్ ఫీట్ల తో ఒక్కొక్క యూనిట్ రూ. 7.75 లక్షల ఖర్చుతో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ళ సముదాయాన్ని కెటిఆర్ ప్రారంభించారు.