ప్రతి వాగ్దానం అమలు చేస్తాం శాసనసభలో సీఎం కెసిఆర్
తాము ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పొందుపరచిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని, అయితే ఇన్ని రోజుల్లోగానే నెరవేరుస్తామని చెప్పమని, అన్ని కోణాలలో ఆలోచించి పటిష్టంగా అమలుపరుస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు.