చవాన్‌తో చర్చలు విఫలం
రెండు రోజుల పర్యటనను ముగించుకొని ఢిల్లీ చేరుకున్న దేశీయాంగమంత్రి వై.బి. చవాన్ ప్రధాని ఇందిరతో సమావేశమై తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆమెకు వివరించారు. ఆయా నేతలతో, బృందాలతో జరిపిన చర్చల సారాంశాన్ని వివరిస్తూ ‘‘తెలంగాణ నేతలంతా రాష్ట్రపతి పాలన కోరతున్నారని’’ ప్రధానితో చెప్పినట్లు పత్రికలు వెల్లడించాయి.