ప్రజల సొమ్ము ప్రజలకే..
నేడు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అద్భుతమైన అవకాశం ఆర్థిక మంత్రిగా నాకు కలిగినందుకు గర్విస్తున్నాను. అధ్యక్షా! తెలంగాణ కొత్త రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అణగారిన తెలంగాణ ప్రజలు సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న రాష్ట్రం.