పారిస్లో కె.టి.ఆర్. ప్రసంగానికి కరతాళ ధ్వనులు
తెలంగాణ కీర్తి పతాకను అనేక విశ్వవేదికల మీద రెపరెప లాడిరచిన మంత్రి కె. తారకరామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఫ్రెంచ్ సెనేట్లో జరిగిన యాంబిషన్ ఇండియా 2021 కార్యక్రమంలో అక్టోబర్ 29న కీలకోపన్యాసం చేయాల్సిందిగా సాక్షాత్తూ ఫ్రాన్స్ ప్రభుత్వం నుండి అందిన ఆహ్వానం మేరకు అక్టోబర్ నెల చివరి వారంలో మంత్రి నేతృత్వంలో ఒక తెలంగాణ ప్రతినిధి బృందం ఫ్రాన్స్ రాజధాని పారిస్లో పర్యటించింది.