సీఎంను రప్పించిన గంగదేవిపల్లె
గంగదేవిపల్లె ప్రజలు తమ గ్రామానికి ముఖ్య మంత్రిని రప్పించుకోగలిగారంటే ఇక్కడి ప్రజలలో ఉన్న చైతన్యమేనని, తమ గ్రామాన్ని చక్కగా తీర్చిదిద్దుకుని, అభివృద్ధిబాటలో పయనింపచేశారని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ఆగస్టు 17న వరంగల్ జిల్లా గంగదేవిపల్లె గ్రామంలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.