కవిత్వ జీవనది గోరటి వెంకన్న
ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవిత్వ జీవనది గోరటి వెంకన్న. కృష్ణా, గోదావరి లాగా వెంకన్న పాట గూడా మరో మహానదీ ప్రవాహమై ప్రజాహృదయ క్షేత్రాలను పండిరచింది. అద్వితీయమైన పాటల నక్షత్రాలతో సమకాలీన కవిత్వానికి నవజీవన తేజస్సును తాత్త్విక ఓజస్సును అందించాడు వెంకన్న.