దేశానికే తెలంగాణ మోడల్ గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్
గౌరవనీయులు శాసనమండలి అధ్యక్షులు, గౌరవ అసెంబ్లీ స్పీకర్, గౌరవ శాసనమండలి, శాసనసభ సభ్యులకు నమస్కారాలు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన శాసనసభ్యులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు. మీ పదవీ కాలం దిగ్విజయంగా సాగాలని, మీరంతా అంకితభావంతో ప్రజాసేవలో నిమగ్నం కావాలని మనసారా అకాంక్షిస్తున్నాను.