మల్లన్న పాదాల చెంతకు గోదావరి జలాలు
కాళేశ్వరం జలాలు మల్లన్నసాగర్ కు తీసుకువచ్చి, కొమురవెల్లి మల్లన్న పాదాలు కడుగుతానని గతంలో ప్రకటించిన మేరకు, మల్లన్నసాగర్ సభానంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లారు.

తెలంగాణ సాగునీటి రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృత మయింది. కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యసాధనలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో నిర్మించ తలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు.