Industrialization of Telangana

default-featured-image

రాష్ట్రంలో మూడు జూట్‌ మిల్లులు

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి  గ్లోస్టర్‌, కాళేశ్వరం ఆగ్రోటెక్‌, ఎంజీబీ కమోడిటీస్‌ మూడు జూట్‌ మిల్లులు ముందుకు వచ్చాయి. ఈ మేరకు పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సమక్షంలో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద పత్రాలపై పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, ఆయా కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు. రాష్ట్రంలోని కామారెడ్డి, వరంగల్‌, సిరిసిల్ల లలో ఈ మిల్లులను స్థాపించనున్నారు. వరంగల్‌లో రూ.330 కోట్లతో గ్లోస్టర్‌, కామారెడ్డిలో కాళేశ్వరం ఆగ్రోటెక్‌ రూ.254 కోట్లతో, సిరిసిల్లలో ఎంబీజీ కమోడిటీస్‌ రూ.303 కోట్లతో పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నాయి. రాబోయే రోజుల్లో మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లోనూ జూట్‌ మిల్లులు ఏర్పాటుచేస్తామని చెప్పారు. 

రాష్ట్రంలో మలబార్‌ కంపెనీ భారీ పెట్టుబడులు

రాష్ట్రంలో మలబార్‌ కంపెనీ భారీ పెట్టుబడులు

రాష్ట్రంలో రూ. 750 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన బంగారం, అభరణాల తయారీ సంస్థ దేశీయ దిగ్గజం మలబార్‌ గ్రూప్‌ కంపెనీ ముందుకొచ్చింది.

default-featured-image

పారిశ్రామికీకరణలో దూసుకుపోతున్న రాష్ట్రం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఈ ఏడు సంవత్సరాలలో పరిశ్రమలను స్థాపించడంలో దూసుకుపోతున్నది. పారిశ్రామిక పెట్టుబడులు తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. ఒక్క సెప్టెంబర్‌ నెలలోనే మలబార్‌ గోల్డ్‌, జూట్‌ పరిశ్రమ, వస్త్ర పరిశ్రమతో కలిపి సుమారు 4వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది.