పెట్టుబడుల వెల్లువ
తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక వేత్తలకు భూతల స్వర్గంగా మారింది. పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. గత నెలలో కేవలం ఒక వారం రోజుల్లోనే ఏకంగా రూ.2,950 కోట్ల పెట్టుబడులను సాధించగలిగింది. లైఫ్ సైన్సెస్‌తోపాటు ఆభరణాలు, వంట నూనెల తయారీ తదితర రంగాలలో ఈ పెట్టుబడులు వచ్చాయి.