ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగ విస్తరణ
భౌగోళిక, భూభౌతిక, వాతావరణ, చారిత్రక, సాంస్కృతిక కారణాలవల్ల ఐటీ రంగ సంస్థలకు అనువైన కేంద్రంగా హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి గుర్తింపును పొందింది. సుమారు 1500 చిన్న, మధ్య తరహా, భారీ ఐటీ సంస్థలు తెలంగాణ రాజధానిలో నేడు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి.