తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
తెలంగాణ ప్రజానీకం ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటైంది. తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టి.బి.ఎన్. రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. నూతన సంవత్సర వేళ జనవరి 1వ తేదీ ఉదయం 8.30 గంటలకు రాజ్ భవన్‌లో గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్, జస్టిస్ రాధాకృష్ణన్ చేత ప్రమాణస్వీకారం చేయించారు.