స్వాతంత్య్ర దినోత్సవం నుండి ‘కంటి వెలుగు’
రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15 మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు.

సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్వయంగా ప్రారంభించనున్న ఈ కంటివెలుగు కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 కోట్ల 70 లక్షల మందికి నేత్రపరీక్షలు నిర్వహిస్తారు.