రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతు కుటుంబాలకు 3లక్షల ఆర్థిక సహాయం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని దేశంలోని రైతులు గత సంవత్సర కాలంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమంలో అసువులు బాసిన రైతులకు, ఒక్కో రైతు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 3 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అలాగే కేంద్రం కూడా ఒక్కో మృతిచెందిన రైతు కుటుంబానికి రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.