తగ్గుతున్న మాతృ మరణాలు వెల్లడించిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్
రాష్ట్ర ప్రభుత్వం మహిళల ప్రసూతి విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల మాతృ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల ప్రసూతి విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల మాతృ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది.
అది కేసీఆర్ కిట్ల పథకం కావచ్చు. పేషంట్ కేర్ కావచ్చు. నవజాత శిశు సంరక్షణ కావచ్చు. ఆపరేషన్లు లేని సుఖ ప్రసవాలు కావచ్చు. ఇంటింటికీ కంటి పరీక్షలు, ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు కావచ్చు. విద్యార్థినులకు న్యాప్కిన్ల, కిట్లు కావచ్చు. హాస్పిటళ్ళకు సదుపాయాలు, ఆఖరకు మరణిస్తే మృత దేహాలను వారి ఇళ్ళ ముంగిళ్ళకు చేర్చే పార్థీవ వాహనాలే కావచ్చు.
కేసీఆర్ కిట్స్ పథకం వల్ల పెరిగిన పనిభారాన్ని ఎంతో ఓపికతో, చిత్తశుద్ధితో మోస్తున్న వైద్యులకు నగదు ప్రోత్సాహం అందించే ఫైలుపై సీఎం సంతకం చేశారు. ప్రగతిభవన్లో వైద్య,ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు సయితం కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తెచ్చి, ఆరోగ్య తెలంగాణ ను సాధించే దిశగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దిశానిర్దేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విశేష కృషి చేస్తోంది.