ఆరోగ్య రంగంలో అగ్రగామి
ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా విద్యా, వైద్యం ముఖ్యమైనవి. ఇది గమనించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆ రెండు రంగాలను ప్రాధాన్య రంగాలుగా గుర్తించి వాటికి నిధులు పెంచడమే కాకుండా, సరియైన ప్రణాళికలు రచించి అమలు పరచడం