Mamatha Venu

మానవీయ పరిమళాల మల్లెచెట్టు చౌరస్తా

మానవీయ పరిమళాల మల్లెచెట్టు చౌరస్తా

ప్రపంచీకరణ ప్రభావం వలన ఆధునిక పోకడలు మారుమూల పల్లెల్లోకి విస్తరించి వ్రేళ్లూనుకొని పోయాయి.గ్రామీణ జీవన విధానం మారింది. పల్లెల రూపురేఖలు మారిపోయాయి. చేతి వృత్తులు కళ తప్పాయి. ఇళ్లూ వాడలూ బోసిపోయాయి.ప్రజల జీవితం సంక్షోభంలోకి నెట్టబడింది.పల్లె తన అస్థిత్వాన్నే కోల్పోయింది.