రైతుకు ప్రోత్సాహకం.. పాడిపరిశ్రమకు ఊతం
తెలంగాణ రాష్ట్రంలో పాడిపరిశ్రమను పరిరక్షించి, పాడిరైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రైవేటు డైరీల గుత్తాధిపత్యం వల్ల ఈరోజు దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో ప్రైవేటు కంపెనీల పాల ధర లీటరుకు రూ.46గాఉంది.