millets festival near zaheerabad villages

రైతమ్మల ఆత్మగౌరవ సంబరం, పాతపంటల జాతర!!

రైతమ్మల ఆత్మగౌరవ సంబరం, పాతపంటల జాతర!!

నల్లని మబ్బుతునకలు కదులుతుంటే, పస్తాపూర్‌ ఎర్రమట్టి పొలాల మధ్య రహదారిలో ఆరుద్ర పురుగుల్లా ఎడ్లబండ్లు కదలి వస్తున్నాయి. వాటిలో పండించిన చిరుదాన్యాల రాసులున్నాయి. ఆ బండ్ల ముందు  పైట కొంగులను  బిగించిన మహిళలు, డప్పుల శబ్దానికి లయబద్ధంగా ఆడుతూ, పాడుతున్నారు.