ఐటీలో మనమే మేటి
తెలంగాణ రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ చట్టం విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది.
తెలంగాణ రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ చట్టం విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది.
రాష్ట్రంలో రూ.6200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు క్యాపిటాల్యాండ్ అనే సంస్థ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అన్ని విధాల సహాయ, సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో మరో సంస్థ వేలకోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.
తెలంగాణ చేనేత వస్త్ర పరిశ్రమ నైపుణ్యం, ఆ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం అద్భుతమని అమెరికాకు చెందిన హ్యాండ్లూమ్, టెక్స్ టైల్ రీసెర్చ్ స్కాలర్ కైరా ప్రశంసలు కురిపించారు.
ఎల్బీనగర్ జోన్ పరిధిలో గల ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు రూ. 55 కోట్ల విలువగల పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తొలుతగా ఎస్‌ఎన్‌డిపి ద్వారా బండ్లగూడ చెరువు నుండి నాగోల్ చెరువు వరకు రూ. 7.26 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నాలాను ప్రారంభించారు. ఫతుల్లగూడ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నుండి మహవీర్ హరణి వనస్థలి నేషనల్ పార్కు మీదుగా పీర్జాదీగూడ వరకు రూ. 26.50 కోట్ల వ్యయంతో చేపట్టిన పీర్జాదీగూడ లింక్ రోడ్డును, ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రంలో రూ. 84 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పెంపుడు జంతువుల స్మశానవాటికను, రూ. 16.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన హిందూ, క్రిస్టియన్ స్మశానవాటిక, ముస్లింల కబరస్థాన్, వనస్థలిపురంలో స్విమ్మింగ్ పూల్‌ను మంత్రి ప్రారంభించారు.
బన్సీలాల్‌పేటలోని 17వ శతాబ్దం నాటి మెట్లబావిని 10 కోట్ల రూపాయల ఖర్చుతో పునరుద్ధరించారు. ఆ బావిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచి కేజీ టూ పీజీ నాణ్యమైన విద్య ఉచితంగా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పలుమార్లు చెబుతూ వస్తున్నారు.
క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్‌లో అగ్రగామిగా ఉన్న అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) రెండో మౌలిక సదుపాయాల రీజియన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అన్నివిధాలా అనువైన వాతావరణం వుండడం మూలంగా, జాతీయ అంతర్జాతీయ కంపెనీలు మన తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి.
ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కును దాటింది. ఇందులో అత్యధిక వాటా ఇండియా, చైనాలది మాత్రమే. ప్రపంచ జనాభా మొత్తానికి యేటా 220 మిలియన్ టన్నుల నూనెగింజలు అవసరం వుంటుంది.
నగరంలో పరిశుభ్రమైన ప్రాణ వాయువు అందించేందుకు ప్రస్తుతం ఉన్న సాంప్రదాయక వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ) ప్రవేశపెట్టాలని ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది.