నల్లా కనెక్షన్లలో మనమే నెంబర్ వన్
ఇంటింటికీ నల్లాలద్వారా శుద్ధిచేసిన, స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 98.31 శాతం ఆవాసాలకు నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తూ దేశంలోనే మన రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత అనేక అంశాల్లో దేశంతోనే పోటీపడుతూ, సాధిస్తున్న విజయపరంపరలో ఇదో మైలురాయి.