MOTHER INFANT CENTRE WITH ALL FACILITIES

సకల వసతులతో మాతా శిశు  ఆరోగ్యకెంద్రం

సకల వసతులతో మాతా శిశు ఆరోగ్యకెంద్రం

బిడ్డ కడుపులో పడగానే అందరిలాగే లకావత్‌ రాధ ఎన్నో కలలు కన్నది. నెలలు నిండుతున్న కొద్ది సంతోషపడ్డది. కానీ మొదటిసారి కాన్సుకు ప్రైవేటు ఆస్పత్రిలో 20వేల దాకా అయిన బిల్లును గుర్తుకు తెచ్చుకుని ఆందోళన చెందింది. కారు డ్రైవర్‌ అయిన తన భర్త అంత డబ్బు ఎక్కడినుండి తెస్తాడు.