జాతి రతనాలు
తెలంగాణలోని పాఠశాల విద్యను 20వ శతాబ్దంలో క్రమశిక్షణతో తీర్చిదిద్దిన మహనీయుడు ముద్దు రామకృష్ణయ్య. 1907 అక్టోబరు 18న కరీంనగర్ జిల్లాలోని పవిత్ర గోదావరీ తీరంలోని మంథనిలో పుట్టిన ఈ జాతిరత్నాన్ని గూర్చి ఈ తరం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.