ఐటీ రంగ విస్తరణతో పెరిగిన ఉపాధి
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 2021 లో రెండవ ఐసీటీ విధానాన్ని విడుదల చేసింది. మొదటి ఐసీటీ విధానం 2016-21 కి ప్రేరణగా, పునాదిగా, కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాంకేతిక, ఆవిష్కరణల రంగాలలో పేరెన్నికగన్న దేశాల సరసన నిలిపే లక్ష్యంతో, పంచ సూత్రాలతో రెండవ ఐసీటీ విధానం రూపుదిద్దుకున్నది.