13 ఎత్తిపోతల పథకాలకు సీ.ఎం శంకుస్థాపన
నల్లగొండ జిల్లా నెల్లికల్లు ఎత్తిపోతల పథకంతోసహా 13 ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు. నాగార్జున సాగర్ వరకూ హెలికాఫ్టర్ లో వచ్చిన ముఖ్యమంత్రి నెల్లికల్లు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన ప్రాంతమైన ఎర్రచెర్వు తండా వరకూ బస్సులో చేరుకున్నారు.