పాలమూరు చరిత్రకు సాక్షి భూతం ఈ మ్యూజియం
దేశంలో పాలమూరు జిల్లా పేరు తెలియని వారు ఉండరు. అంతేకాక అగ్గి పెట్టెలో పట్టె గద్వాల చేనేత చీరలు, కొత్తకోట చేనేతలు, నారాయణపేట కంబళ్లతో పాటు, పాత రాతి యుగం,మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం ఆనవాళ్లకు ఎన్నో శిల్పాలు,శాసనాలు,దేవాలయాలు, పనిముట్లు, మరెన్నో అద్భుత కట్టడాలకు నిలయం ఈ జిల్లా.