వీరజవాన్లకు అండగా..
బడ్జెట్ కోసం సమావేశమైన శాసనసభలో, సభ ప్రారంభం కాగానే పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు సంతాపం తెలియజేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన దాడి అత్యంత అమానుషమైనదని,సైనికుల మీద, వ్యక్తుల మీద జరిగిన దాడిగా కాకుండా సమస్త దేశంపై జరిగిన దాడిగా అందరూ భావిస్తున్నారని తెలిపారు.