మన వారసత్వ సంపదకు జగతి ఆరతి
‘ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో… ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో…’ అని మన డాక్టర్ సి నారాయణరెడ్డి అన్నట్లు,రామప్ప ఆలయ రమణీయతను చూడడానికి కోట్ల కన్నులు చాలవు. ఆ సౌందర్యాన్ని చూసి మ్రోగని గుండెలు ఉండవు. తెలుగునేలపై గొప్ప గుర్తింపు పొందిన తొలి చారిత్రక కట్టడంగా, రామప్ప పేరు విశ్వవీధుల్లో నేడు మారుమోగుతోంది.మన తెలంగాణ భూమిపై ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో కొలువై