భోజనం ఐదు రూపాయలకే
అన్నం పరబ్రహ్మ స్వరూపం….. అన్న సామెతను నిజం చేస్తుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్. బతుకుదెరువు కోసం పల్లెల నుంచి పట్నానికి వచ్చి అడ్డాకూలీలుగా పనిచేస్తూ బుక్కెడు బువ్వకోసం అలమటిస్తున్న వారికి రాజధానిలో మేమున్నా మంటూ బరోసా ఇస్తుంది జిహెచ్‌ఎంసి.