సాహితీ వనంలో ఒకమాలి ‘కపిలవాయి’
సాహితీ జగత్తులో హిమాలయం కన్న మిన్నగా కన్పిస్తున్న మాన్యులు కపిలవాయి లింగమూర్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందని తెల్సినా, నల్లగొండ వాస్తవ్యులు డా. కొల్లోజు కనకాచారి చాలా శ్రమించి ”సాహితీ వనంలో ఒకమాలి” అనే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చారు.