జంగిల్ బచావో జంగిల్ బడావో
రాష్ట్రంలో అడవులు కాపాడే విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, కలప స్మగ్లర్లపై పి.డి. యాక్టు నమోదు చేసి శిక్షిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హెచ్చరించారు. అడవులు నరికి, కలప స్మగ్లింగ్ చేసే వారిని గుర్తించే పనిలో ఇంటెలిజెన్స్ వర్గాలున్నాయన్నారు.