తెలంగాణ జాతి గర్వించేలా జరిగిన వజ్రోత్సవ వేడుకలు
సెప్టెంబరు 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు రాష్ట్రమంతటా అంగరంగ వైభవంగా జరిగాయి.
సెప్టెంబరు 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు రాష్ట్రమంతటా అంగరంగ వైభవంగా జరిగాయి.
యావత్ తెలంగాణ ప్రజలకూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారింది.
1947 జూన్ 11వ తేదీన తనకు స్వతంత్రం లభించిందని నిజాం ఒక ఫర్మానా విడుదల చేశాడు. దీనికి ప్రజా మద్దతు లేదని తెలుసుకున్న నిజాం భారత ప్రభుత్వంతో సంధిచర్యలను ప్రారంభించాడు.