శ్రీరాంసాగర్ దశ తిరిగింది
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి సాగునీరు కాకతీయ కాలువ ద్వారా లోయర్ మానేరు డ్యామ్ లోకి వస్తోంది. కాకతీయ కాలువ దిగువ మానేరు డ్యాం వరకు సుమారు 143 కిలో మీటర్ల పొడువున ఉంది. కాకతీయ కాలువ స్టేజ్ -1 కింద 9 లక్షల 68 వేల 600 ఎకరాల ఆయకట్టు ఉంది. స్టేజ్-2కింద వరంగల్, నల్లగొండ జిల్లాల్లో మరో 4 లక్షల 40వేల ఎకరాల ఆయకట్టు ఉంది.