సాగునీటి శాఖ పునర్వ్యవస్థీకరణ – లక్ష్యాలు
రాష్ట్రంలో అన్ని సాగునీటి వ్యవస్థలను.. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, చెక్ డ్యాంలు, ఆనకట్టలు, కత్వాలు, చిన్నా పెద్దా లిఫ్ట్ స్కీమ్లను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి, వీటి వలన ఆశించిన ఫలితాలను పొందడానికి, సాగునీటి శాఖలో సమగ్రమైన పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి తలపెట్టారు.