పరిణత పాత్రికేయుడు జియస్ వరదాచారి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జానకమ్మ కడుపున 1932 అక్టోబర్ 15వ తేదీన పుట్టిన వరదాచారి బి.ఏ. పట్టా సాధించిన తర్వాత ఒక యేడాది జర్నలిజంలో స్నాతకోత్తర డిప్లొమా పూర్తి చేసి, ఇష్టపూర్వకంగా 1954లో జర్నలిజం రంగంలో పాదం పెట్టారు.