పెద్దాయన
కొణిజేటి రోశయ్య వెళ్లిపోయారు. పంచెకట్టుతో నిలువెత్తు తెలుగుదనం మూటగట్టుకున్న పెద్దమనిషి. ఆహారంలో, ఆహార్యంలో, వ్యవహారంలో పల్లెదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉండేది. ఆయన మాటలు వింటూ వుంటే ఒకప్పటి మన ఊరు శెట్టిగారితో మాట్లాడుతున్నట్లు పాతరోజులు చాలామందికి గుర్తుకు వస్తాయి.