రైతు సమస్యలపై సుదీర్ఘచర్చ
తెలంగాణ రాష్ట్ర శాసన సభ, శాసన మండలి వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమై అక్టోబర్ 7వ తేదీ వరకు జరిగాయి. సెప్టెంబర్ 23న మొదటి రోజు ఉభయ సభలు మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె అబ్దుల్ కలాం, నారాయణఖేడ్ శాసనసభ్యులు పి. కిష్టారెడ్డిల మృతికి సంతాపం తెలిపి వాయిదాపడ్డాయి.