పలు కీలక నిర్ణయాలతో ముగిసిన అసెంబ్లీ సమావేశాలు
ఉద్యోగాల నియామక నోటిఫికేషన్లకు గ్రీన్ సిగ్నల్, జీవో 111 రద్దు నిర్ణయం, సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించడం తదితర కీలక నిర్ణయాలతో ముగిసిన అసెంబ్లీ సమావేశాలు.
ఉద్యోగాల నియామక నోటిఫికేషన్లకు గ్రీన్ సిగ్నల్, జీవో 111 రద్దు నిర్ణయం, సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించడం తదితర కీలక నిర్ణయాలతో ముగిసిన అసెంబ్లీ సమావేశాలు.
రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని సీట్లను అధికార టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొదట శాసనసభ్యుల కోటాలో ఉన్న 6 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరుగగా, అనంతరం స్థానిక సంస్థలకు సంబంధించి 12 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటన్నింటిలోను టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులే ఎన్నికయ్యారు.
అసెంబ్లీ, కౌన్సిల్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో మొదటి రోజు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభను ప్రారంభించగానే ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా స్పీకర్ పలువురు కీర్తిశేషులైన శాసనసభ్యుల పేర్లను చదివి వినిపించారు. వారి రాజకీయ జీవితం గురించి, వారు చేసిన సేవల గురించి తెలియచేశారు.
‘బంగారు తెలంగాణ’ సాకారం చేసే దిశగా, ప్రజల ఆశలను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి ఈటల రాజేందర్ మార్చి 14న శాసనసభలో 2016-17 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.