ఐ.టి. రంగానికి మరింత జోష్
భారతదేశపు 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ, అప్పటి జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేకించి ఐటీ, అనుబంధ రంగాల స్థితిగతుల్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ఐసీటీ విధానం, ఇతర అనుబంధ విధానాలను 2016లో విడుదల చేసింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించే సమయంలో ఇతర రంగాలతోపాటు, ఐ.టి రంగంపై కూడా కొందరు పనిగట్టుకొని అనేక అపోహలు, అపనమ్మకాలు, అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో గత ఏడేళ్ళ పాలనలో ఈ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.
ప్రపంచ ఐ.టి రంగంపై తనదైన ముద్రవేసుకున్న తెలంగాణ రాష్ట్రం మరింతగా క్రియాశీలమయ్యేందుకు కొత్త ఐ.టి పాలసీని ఆవిష్కరించింది.