తెలంగాణా జీవన చిత్రాలు
తెలంగాణ జీవనాన్ని, జీవన వృత్తులను, జీవన సౌందర్యాన్ని తనలోకి ఒంపుకొని దృశ్యబద్ధం చేసిన చరిత్రకారుడాయన! కళా జీవితం అంటే తాను నమ్మిన సిద్ధాంతాలను తాను పుట్టిన భూమిని, భూమికను విడవకుండా, తన ఎనభై ఏడేళ్ళ జీవితాన్ని కళామతల్లికి అంకితం చేసి ప్రపంచ చిత్రకళా పటంలో తెలంగాణ జీవితాన్ని పదిల పరిచిన చిత్రకళా తపస్వి కీ.శే. డా॥ కాపు రాజయ్య గారు.