ప్రజా భద్రత భేష్
తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో మహిళా భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మార్గదర్శనంలో హోం శాఖ ప్రజల భద్రతకు సంబంధించి విన్నూత్న కార్యక్రమాలు చేపట్టింది.

తెలంగాణ పోలీస్ శాఖకు,ఉత్తమ పనితీరు కనబరిచినందుకు, రెండు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీఎస్‌సీఐ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కాం) సంయుక్తంగా వివిధ దర్యాప్తు ఏజెన్సీలకు వేరు వేరు క్యాటగిరీలలో అవార్డులను ప్రకటించాయి.మొదటి అవార్డు, సైబర్ నేరాల దర్యాప్తులో అనుసరిస్తున్న వ్యూహాలు, సిబ్బందిని సైబర్ వారియర్స్‌గా మార్చే విధానంలో తీసుకునే చర్యలకు సంబంధించి డీఎస్‌సీఐ ఎక్సలెన్స్ అవార్డు-2021 లభించింది.ఆ విధంగా పోలీస్ ఏజెన్సీల సామర్థ్యాల పెంపుదలలో మొదటి స్థానంలో నిలిచింది.