ప్రధాని విజ్ఞప్తితో ఉద్యమానికి విరామం!
రాష్ట్రపతి ఎన్నికలతో కాంగ్రెస్‌లో ప్రారంభమైన వివాదాలు ప్రధాని ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీనుంచి బహిష్కరించేదాకా వెళ్ళాయి. 1969 నవంబర్ 12న సమావేశమైన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం ఇందిరాగాంధీపై 5 ఆరోపణలు సంధిస్తూ ఆమె క్రమశిక్షణ ఉల్లంఘించిందంటూ కాంగ్రెస్‌నుంచి బహిష్కరించింది.