స్తుతమతి ఉమాపతి
కొద్ది రోజుల వ్యవధిలోనే తెలంగాణ తల్లి ముద్దుబిడ్డలయిన ఇద్దరు సాహితీ ప్రముఖుల్ని కోల్పోయింది. ఒకరు గంగా నిర్జరీ అభంగ తరంగ కవితా చైతన్యాన్ని లోకానికి పంచిన జ్ఞానపీఠాధిష్ఠితుడు కాగా మరొకరు సరస సరస్వతీ స్తోత్రస్విని లాగా అంతర్వాహినిగా కవిత్వాన్ని, వేదాంతాన్ని ప్రపంచించిన అంతర్ముఖీనులు.