వివిప్యాట్ (VVPAT) అంటే ఏమిటి ?
వివిప్యాట్ అంటే ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఇది ప్రింటర్. ఈ యంత్రం ఇ.వి.ఎంకు అనుసంధానం చేసి ఉంటుంది. ఈ రెండూ కూడా ఓటర్ క్యాబిన్‌లోనే ఉంటాయి. ఓటర్ తాను ఓటు వేసిన అభ్యర్థికే ఆ ఓటు పడిందా లేదా అని తనిఖీ చేసుకోవడానికి వీలుగా దీనిని రూపొందించారు.